రైళ్లలో తోటి ప్రయాణికుల తీరుపై గాయని శివశ్రీ ఆవేదన

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రజా రవాణాలో పౌర స్పృహ లోపించడంపై కర్ణాటకకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత గాయని శివశ్రీ స్కందప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ప్రయాణంలో నలభై మందితో కూడిన పెద్ద బృందం ఐదు గంటల పాటు నిరంతరం బిగ్గరగా మాట్లాడుతూ తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందని ఆమె తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ, దేశంలో పబ్లిక్ ప్రవర్తన ఎప్పుడు మారుతుందంటూ ఆమె తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.