పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కోరిన రేవంత్ రెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం బృందాలు కలిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విజ్ఞప్తిపై ఆయా పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి త్వరలోనే తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు.