బరువు తగ్గే మందులతో పురుషులకు బట్టతల ముప్పు పెరుగుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

బరువు తగ్గేందుకు వాడే ఒజెంపిక్, వెగోవీ వంటి మందులు పురుషుల్లో బట్టతల ముప్పును పెంచుతున్నట్లు న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. జన్యుపరంగా ఇప్పటికే బట్టతల వచ్చే అవకాశం ఉన్నవారిలో ఈ GLP-1 ఔషధాల వల్ల మరో 7 శాతం రిస్క్ పెరుగుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వేగంగా బరువు తగ్గడమే కాకుండా దీని వెనుక జన్యుపరమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.