స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: ప్రతి పల్లెలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ సత్యసాయి

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతూ ప్రతి పల్లెలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని మరింత వేగంగా కొనసాగించుకుందామని పరిటాల శ్రీరామ్ - ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కార్యకర్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శక్తిని చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరుతూ పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.