ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం రూరల్
ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవనం పూర్తయితే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.