ప్రజల కోసం ప్రశ్నించే గొంతు ఎప్పటికీ ఆగదంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ సవాల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

అప్పుడు మహాత్మా గాంధీ హుకూమత్ను ప్రశ్నించారని, ఇప్పుడు అదే ధైర్యంతో రాహుల్ గాంధీ న్యాయం కోసం నిలదీస్తున్నారని AP Congress (INC) వెల్లడించింది. ప్రజల కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొంటూ సామాజిక మాధ్య వేదికగా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.