ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా కీలక ప్రకటన చేశారు. 2027లో జరగనున్న ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 17 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.