హైదరాబాద్ లో తాగునీటి కొరతకు చెక్: గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన మురుగునీటిని మానవేతర అవసరాలకు సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించిందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నిర్మాణ రంగం, కార్ వాషింగ్ మరియు గార్డెనింగ్ వంటి అవసరాల కోసం గ్రీన్ ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని అందించనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో ఇరవై ఒకటి ట్యాంకర్లను సిద్ధం చేశామని, ఈ విధానం ద్వారా తాగునీటి డిమాండ్ ఇరవై శాతం తగ్గుతుందని అధికారులు స్పష్టం చేశారు.