ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ మృతితో దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన రాజ్ పాల్ యాదవ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Mumbai

క్యాన్సర్‌తో బాధపడుతూ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించడానికి కేవలం రెండు గంటల ముందే ఆసుపత్రిలో కలిశానని, ఆయనతో మాట్లాడిన క్షణాలు తనను కలచివేశాయని ప్రముఖ నటుడు రాజ్ పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాక్ ఖాన్ మృతి పట్ల సన్నీ డియోల్, అనీస్ బజ్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.