పర్యావరణ హితం కోసం మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లా పట్టణంలోని సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్ ఆవరణంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ కోశాధికారి గుర్రం సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు, భూమి కలుషితమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతిని రక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.