నందికొట్కూరు మున్సిపాలిటీ కైవసం: వైసీపీ ఖాతాలో తొలి విజయం నమోదు

రిపోర్టర్: నరేష్ స్థలం: నంద్యాల

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టిందని నంద్యాల జిల్లా అధికారులు తెలిపారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో ముప్ పై రెండు వార్డులకు గాను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇరవై మూడు స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారని వెల్లడించారు. చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఫాతిమా బీ నాలుగు వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.