పోలవరం ఎడమ కాలువతో మెట్ట ప్రాంతాల్లో సాగు విప్లవం

రిపోర్టర్: శివ స్థలం: తూర్పుగోదావరి

పోలవరం ఎడమ కాలువ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు తీరాయి. 89 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరో 37 వేల ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గోదావరి జలాలతో బీడు భూములు సస్యశ్యామలం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మోటార్ల ద్వారా నీటిని తోడుకునే సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.