నేలకొండపల్లిలో బౌద్ధ ఉత్సవాలు: ఘనంగా నిర్వహించిన చారిత్రక ఆధ్యాత్మిక వేడుకలు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చారిత్రక బౌద్ధ స్తూపం ప్రాంగణంలో బౌద్ధ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులతో పాటు కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ పాల్గొన్నారు. క్షేత్రంలోని ఆధ్యాత్మిక విశేషాలను పరిశీలించిన కలెక్టర్.. బౌద్ధ క్షేత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.