నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా
రిపోర్టర్: నరేష్
స్థలం: India
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కేవలం ఒక్క రోజులోనే ఇండియా ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, డిజిటల్ వేదికపై ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.