వర్షపు నీటితో చెరువులా మారిన కిర్లంపూడి ప్రధాన రహదారి

రిపోర్టర్: Srinivasarao Ummidisetti స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సామర్లకోట-ప్రత్తిపాడు ప్రధాన రహదారి వర్షం పడితే చాలు చెరువును తలపిస్తోంది. శుక్రవారం గంటపాటు కురిసిన వర్షానికి రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో అధికారులు, స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది కీలకమైన ప్రధాన రహదారి కావడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. నిలిచిన నీటిని తొలగించడానికి అధికారులు తాత్కాలిక చర్యలు కాకుండా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.