ఘోర విషాదం: సీమాపురిలో కుప్పకూలిన భవనం దుర్మరణం చెంది ముగ్గురు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో గర్భిణీతో సహా ముగ్గురు దుర్మరణం చెందారని, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్ భూకంపం కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.