ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలంటూ శ్రీనివాస్గౌడ్ డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: మహబూబ్‌నగర్

ఎండిపోయిన ప్రతి ఎకరా పంటకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్లే జిల్లాలో తీవ్రమైన వలసలు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.