రైల్వే రక్షణ బలోపేతానికి మల్కాజిగిరి కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

తెలంగాణలో రైల్వే మౌలిక వసతులు, ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మొట్టమొదటిసారిగా మల్కాజిగిరి – కామారెడ్డి మార్గంలోని 108 కిలోమీటర్ల మేర అత్యాధునిక ‘కవచ్ 4.0’ రక్షణ వ్యవస్థను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.