దేశీయ మార్కెట్లో భారీగా తగ్గిన బంగారం మరియు వెండి ధరలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గత వారం రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి ప్రియులకు ఊరటనిచ్చేలా గడిచిన వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారంపై ఏకంగా మూడు వేల నూట అరువై రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభిస్తోందని, ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.