ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్త రామదాసు వారసులు

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాసు పదో తరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ఈవో శీనా నాయక్ వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం అందించారు. రామదాసు వంశీయులుగా ఉండటం పూర్వజన్మ సుకృతమని శ్రీనివాసరావు తెలిపారు.