నీటిమట్టం తగ్గడంతో వెలుగులోకి సంగమేశ్వరాలయ శిఖరం!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నంద్యాల
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం శ్రీశైలం జలాశయం నీటిమట్టం వేగంగా తగ్గడంతో బయటపడింది. జలాధివాసమైన ఐదు వారాలకే శిఖరం కనిపించడం గమనార్హం. ఆలయ పూజారులు శిఖరానికి జెండా కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయం మట్టం 864 అడుగులకు పడిపోయింది. ఇరవై మూడేళ్లలో ఇంత తక్కువ సమయంలో శిఖరం బయటపడటం ఇదే మొదటిసారి.