ఆవు పేడతో అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్పేస్ సూట్లు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓం దివ్య దర్శన్ సంస్థాన్ ఆవు పేడతో అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, స్పేస్‌సూట్లు తయారు చేయడానికి సన్నద్ధమవుతోంది. జర్మన్, స్విస్ సాంకేతికతను ఉపయోగించి పేడ నుంచి లభించే నానో సెల్యులోజ్‌తో వీటిని తయారు చేయనున్నారు. నాసా కోసం ప్రత్యేకంగా స్పేస్‌సూట్లను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అరవింద్ రాజ్‌పుత్ తెలిపారు. యూపీలో ఐదు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు.