పూర్తయిన రియో రాజ్ 'మ్యాడీ' సినిమా షూటింగ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Chennai

కోలీవుడ్ నటుడు రియో రాజ్, సానియా అయ్యప్పన్ జంటగా నటిస్తున్న 'మ్యాడీ' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్తికేయన్ బీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రంలో సింగంపులి, అజు వర్గీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.