వీల్ చైర్ పై వచ్చి ఓటేసిన తొంభై ఏళ్ల రాములమ్మ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల పంచాయితీలో సుమారు 90 సంవత్సరాల వృద్ధురాలు జరుగుళ్ళ రాములమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. వయసు, అనారోగ్యం అడ్డుకోలేకపోయాయని, ఓటు వేయడం తన బాధ్యత అని చెప్పారు. ఆమెను చూసి యువ ఓటర్లు స్ఫూర్తి పొందాలని అక్కడ ఉన్నవారు అభిప్రాయపడ్డారు. ఆమె నిబద్ధతను చూసి స్థానికులు ఎంతో అభినందించారు.