గాంధీ చిత్రపటానికి చెప్పులతో నివాళి: కార్యదర్శి తీరుపై సర్వత్రా విమర్శలు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి శ్వేత చెప్పులు ధరించే మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం వివాదాస్పదమైంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారి నిబంధనలు విస్మరించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామ మూడో వార్డు సభ్యుడు సిరిపురపు మహేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.