బీసీసీఐ నిర్ణయంపై దిలీప్ వెంగ్సర్కార్ తీవ్ర విమర్శలు: రంజీ టోర్నీ నిర్లక్ష్యం
రిపోర్టర్: మహేష్
స్థలం: Mumbai
దేశీయ రంజీ ట్రోఫీ సీజన్ సమయంలో ఇండియా ఏ జట్టును విదేశీ పర్యాలకు పంపడాన్ని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాన దేశీయ టోర్నమెంటు ప్రాముఖ్యతను తగ్గించేలా షాడో టోర్నీలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. రంజీ సీజన్ జరుగుతుంటే ఏ టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని బీసీసీఐని ఆయన నిలదీసినట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.