శ్రమను నమ్ముకున్న విశ్వకర్మల అభివృద్ధికి భరోసానివ్వాలి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ విశ్వకర్మ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా శ్రమను నమ్ముకున్న శిల్పులు, చేతివృత్తిదారులకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి శ్రమకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.