విజయవాడలో క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించిన చంద్రబాబు, నడ్డా

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో రూ.249 కోట్ల వ్యయంతో నిర్మించిన 9 క్రిటికల్ కేర్ యూనిట్లు, 12 ప్రజారోగ్య ప్రయోగశాలలను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తోందని చంద్రబాబు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.