మాడుగులలో ఘనంగా జరిగిన ఎన్డీఏ కూటమి క్యాడర్ మీటింగ్
రిపోర్టర్: హరి
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.