తిరువూరు మున్సిపల్ ఎన్నికలు: సన్నాయి మేళంతో వినూత్న రీతిలో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం
రిపోర్టర్: రమేష్
స్థలం: తిరువూరు
తిరువూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజు 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి చిత్తలూరి లక్ష్మి సన్నాయి మేళంతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ సాగిన ఈ వినూత్న ప్రచారం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీలు, అభ్యర్థులు తమదైన శైలిలో చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు.