యువతకు మార్గదర్శనం చేస్తూ భవిష్యత్తును కాపాడే పోలీసుల చైతన్య నినాదం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లాలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి సూచించారు. మంచిర్యాల గోదావరి రోడ్లో ఉచిత పోలీస్ శిక్షణ పొందుతున్న యువతకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈవ్టీజింగ్, మహిళల వేధింపులు, స్టాకింగ్, డిజిటల్ వేధింపులపై వివరించారు. మహిళలు సమస్యలు ఎదురైతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112, షీ టీమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.