రైతన్నలకు తీపి కబురు: తెలంగాణలో పన్నెండు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఎల్నినో ప్రతికూల పరిస్థితులు మరియు తీవ్ర విద్యుత్ కొరత వేధిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని వ్యవసాయ బోర్లకు నిరంతరం రోజువారీగా పన్నెండు గంటల పాటు విద్యుత్ అందిస్తున్నట్లు డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతలకు అత్యధిక సమయం కరెంట్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుదుత్పత్తి భారీగా తగ్గినప్పటికీ వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డిస్కంల నివేదిక పేర్కొంది.