సిరిసిల్ల గడ్డపై ప్రజల ఆదరాభిమానాలు గుండెను హత్తుకున్నాయంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగం

రిపోర్టర్: హరి స్థలం: వికారాబాద్

సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ సైన్యం మరియు ప్రజాప్రతినిధులు వెంటరాగా ప్రజాపాలనకు మద్దతుగా జనమంతా జేజేలు కొట్టారని, సబ్బండ వర్గాలు అందించిన ఆదరణ, ఆప్యాయత, అభిమానం తన గుండెను హత్తుకున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒక కుటుంబ సభ్యుడిలా తనను చూసి ప్రజలంతా ఎంత ఆనందపడ్డారోనని, వారి కళ్లలో కనిపించిన ఆ ఆనందాన్ని చూసి తాను ఎంతగానో సంతోషించినట్లు పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన ఎప్పటికీ గుర్తుండిపోతుందని స్పష్టం చేశారు.