పదిహేను రోజుల్లో పూర్తి ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జనగామ

నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు పదిహేను రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ లంచాలకు తావులేకుండా సోమవారం వారానికోసారి బిల్లులు ఇస్తున్నామన్నారు. గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు.