సూరత్ లో దారుణం: జీతం కోతల వివాదంలో సహచర కార్మికుడి అతికిరాతక హత్య

రిపోర్టర్: అశోక్ స్థలం: Surat

గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకున్న భయానక హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. జీతంలో కోతలు పెడుతున్నాడన్న అనుమానంతో సంజయ్ ఖోస్లా అనే టెక్స్టైల్ కార్మికుడిని సచిత్ర బాల్ అనే సహచర కార్మికుడు అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు కతర్గామ్ పోలీసులు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీన నిందితుడు బాధితుడి గొంతు కోసి చంపి, మృతదేహాన్ని శ్మశానవాటికలో పడేశాడు. ఆ తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు తలను వేరుచేసి రైల్వే ట్రాక్ సమీపంలో పారేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.