రాజకీయ సంచలనం: కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని మద్దతు ప్రకటించిన కే.అన్నమలై
రిపోర్టర్: రాజేష్
స్థలం: కోయంబత్తూరు
కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే.అన్నమలై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఆ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని పలువురు పేర్కొన్నారు.