గంజాయి దందా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులతో పాటు విక్రయిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఆర్లపెంట గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ గుట్టురట్టయింది. నిందితుల నుంచి పావు కిలో గంజాయి, ఒక ద్విచక్రవాహనం, రెండు చరవాణులను స్వాధీనం చేసుకుని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్, డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.