వేధింపుల బాధితురాలికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గల్లా మాధవి
రిపోర్టర్: నరేష్
స్థలం: గుంటూరు
మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న భర్త బారి నుంచి కాపాడాలని కోరుతూ రిజ్వానా అనే మహిళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే బాధితురాలితో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు.