బిట్స్ పిలానీ సంచలన నిర్ణయం: వంద శాతం స్కాలర్షిప్ల ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పిలానీ

బిట్స్ పిలానీ ప్రవేశ పరీక్షలో టాప్ వెయ్యి ర్యాంకులు సాధించే విద్యార్థులకు పూర్తి స్థాయి స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి. రాంగోపాల్ రావు వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదాయం ఇరవై లక్షల రూపాయల లోపు ఉన్న అర్హులైన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ట్యూషన్ ఫీజు పూర్తిగా మాఫీ చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రవేశం పొందిన నాటి నుండి ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపారు.