ఏపీకి భారీ పెట్టుబడులు: అనంతపురంలో కొలువుదీరనున్న ప్రముఖ ఆటోమొబైల్ పరిశ్రమలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనంతపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతోందని, దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల సరఫరా సంస్థలు రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. మంత్రి నారా లోకేశ్ గతంలో చేసిన పర్యటనల ఫలితంగా హ్వాషిన్, సియోన్, ఐవామెట్ కంపెనీలు అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపాయని, దీని ద్వారా సుమారు 1,418 మంది స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.