సిగరపల్లిలో కూటమి అభ్యర్థుల తరఫున కదంతొక్కిన నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండలం సిగరపల్లి గ్రామంలో కూటమి నాయకులు ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బొమ్మసముద్రం ఎంపీటీసీ అభ్యర్థి దేవాజీకి సైకిల్ గుర్తుపై, జెడ్పీటీసీ అభ్యర్థి మహేష్కు గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.