విశాఖలో హెచ్ఎస్ఎల్ నూతన స్లిప్‌వే ప్రారంభం: రక్షణ రంగంలో దేశం అగ్రగామిగా దూసుకుపోతోందన్న రాజ్‌నాథ్‌సింగ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని హెచ్ఎస్ఎల్లో నూతన స్లిప్‌వేతో పాటు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అద్భుతమైన సహకారం అందుతోందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.