విజయనగరం ఉత్సవంలో అశోక్ గజపతి రాజు ఘాటు వ్యాఖ్యలు: భక్తులపై ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక సిరిమానోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గొన్న ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. నిఘా ముసుగులో భక్తుల వీపులు పగలగొడతామని హెచ్చరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.