రూ.99 మద్యం హామీపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన పేర్ని నాని
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
చంద్రబాబు హామీ ఇచ్చిన రూ.99 బ్రాందీ ఏ ఊరిలో దొరుకుతుందో కూటమి ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని నిలదీశారు. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవేనని, ఎక్సైజ్ శాఖ మంత్రి ఇంటి చుట్టూనే పది బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. టెండర్లలో ఎవరికి షాపు వచ్చినా ఎమ్మెల్యేలు బెదిరించి కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.