గుంటూరు జిల్లా తెనాలిలో భవనంపై ప్రత్యేకంగా నిలిచిన గాంధీ విగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెనాలి

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ భవనంపై ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని స్థానికులు తెలిపారు. దశాబ్దాల క్రితం శిల్పకళా మందిరం ఉన్న ఈ ప్రాంతం నుంచి కార్యాలయాన్ని మరోచోటుకు మార్చినా, గాంధీ విగ్రహాన్ని మాత్రం అక్కడే ఉంచారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో ఉన్న ఈ విగ్రహం నగరానికి ప్రత్యేక శోభను తెస్తోందని అధికారులు పేర్కొన్నారు.