అమెరికా వర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

రిపోర్టర్: గోపి స్థలం: USA

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు భారతీయ సంతతికి చెందిన అనురాధ, వికాస్ సిన్హా దంపతులు 20 మిలియన్ డాలర్ల భారీ విరాళం అందజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ కొత్త కాలేజీ ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని సమకూర్చారు. ఈ విరాళం ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు.