ఇరవై ఏళ్ల తర్వాత రాజాం పురపాలికకు ఎన్నికలంటూ ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టీకరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: రాజాం

రాజాం పురపాలికకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. హైకోర్టు వాజ్యాలను కొట్టేయడంతో ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు కోట్ల రూపాయలు నిలిచిపోయాయని చెప్పారు. రాజాం పట్టణంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించిన అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.