ధృవ్ విక్రమ్, రమేష్ వర్మ క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ షురూ
రిపోర్టర్: శివ
స్థలం: India
టాలీవుడ్, కోలీవుడ్ నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వి స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హై ఆక్టేన్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 23న ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ అప్డేట్ రానుంది.