అక్రమ కేసులతో బెదిరించలేరంటూ వైఎస్సార్సీపీ నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సత్తెనపల్లి
సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన శాంతియుత ధర్నాలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు. అర్ధరాత్రి పూట డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఇంటితో పాటు జీబీఆర్ ఆసుపత్రిలో సోదాలు చేయడం అన్యాయమన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.