డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పిప్పళ్ళ శివశంకర్ ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

యాచారం మండలం కేంద్రంలో నిర్వహించిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా 18వ మహాసభల్లో నూతన అధ్యక్షునిగా ఆమనగల్ ప్రాంతానికి చెందిన పిప్పళ్ళ శివశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభల్లో నిరుద్యోగ యువత సమస్యలపై చర్చించి, ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగించాలని తీర్మానించారు. శివశంకర్ ఎన్నిక పట్ల పవన్, ప్రవీణ్, రాజు, మల్లేష్, వినోద్ సహా పలు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.